ప్రజలతో లావాదేవీలు నిర్వహిస్తూ.. సామాజిక సేవలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ముందుందని రాజంపేట పురపాలక కమిషనర్ శ్రీ హరి బాబు తెలిపారు. బ్యాంక్ ఏర్పడి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఏపీజీపీ, ఏజీఎం, జేఎల్ఎన్ ప్రసాద్ మాట్లాడారు. ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 5 జిల్లాల్లో 542 శాఖల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 28,500 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించగా... 230 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. ఏడు లక్షల మంది రైతులకు 7,500 కోట్ల రూపాయల రుణాలను.. లక్ష స్వయం సహాయక సంఘాలకు 2500 కోట్ల రూపాయల రుణాలు అందజేసినట్లు వివరించారు. అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.
రాజంపేటలో రక్తదాన శిబిరం - kadapa
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏర్పడి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప జిల్లా రాజంపేటలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.