మైనారిటీ మంత్రిగా ఉంటూ రాష్ట్రం నుంచి దిల్లీ ప్రార్థనకు ఎంతమంది వెళ్లారన్న వివరాలు లేకపోవడం సిగ్గుచేటని భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి షేక్ అంజాద్ బాషా తీరును తప్పుబట్టారు. ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకినట్టుగా వార్తలు వస్తే.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనా విజృంభిస్తుంటే కడప నగరానికి కేవలం రూ. 7 లక్షలు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందడానికి ఉప ముఖ్యమంత్రే కారణమని ఆరోపించారు.
ఇదీ చూడండి: