లాక్డౌన్కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. కడప జిల్లాలో 50 శాతం పైగానే జడ్పీటీసీ..,ఎంపీటీసీలను అధికారాన్ని ఉపయోగించి వైకాపా ఏకగ్రీవం చేసుకుందని విమర్శించారు. వాటిని రద్దు చేయాలని ఎస్ఈసీని కోరారు.
కడప నగరంలో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు... జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రను ఆదుకోవడానికి కేంద్రం ప్రత్యేక కృషి చేస్తోందన్న ఆయన... పోలవరానికి నిధులు ఇచ్చిన తరహాలోనే రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ముందడుగు వేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇసుక బంగారం కంటే ఎక్కువ ప్రియమైందన్న సోము వీర్రాజు... చంద్రబాబు హయాంలో కొంత అవినీతి జరిగినా ఇసుక మాత్రం లభ్యమయ్యేదన్నారు. కానీ జగన్ ప్రభుత్వంలో ఇసుక దొరకడం గగనమైందని వ్యాఖ్యానించారు. ఇసుకపై త్వరలోనే భాజపా ఉద్యమం చేపడుతుందని తేల్చి చెప్పారు.
రాయలసీమను దత్తత తీసుకుంటాం
రాయలసీమను భాజపా దత్తత తీసుకుంటుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రైల్వే కోడూరులో కార్యకర్తల శిక్షణా కార్యక్రమానికి హాజరైన ఆయన...రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. సీమ ప్రజలను అన్ని పార్టీలు సెకండ్ గ్రేడ్ సిటిజెన్స్గా చూస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ రాయలసీమ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
ఇదీచదవండి