కడప జిల్లా ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య లోపంపై భాజపా ఆందోళనకు దిగింది. ఆ పార్టీ శ్రేణులు మురికి కాలువలో కూర్చోని నిరసన తెలిపారు. చెత్తను తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటూ డిమాండ్ చేశారు. పెరుకుపోయిన చెత్తతో దోమలు వ్యాప్తి చెంది..పిల్లలు, పెద్దలు విషజ్వరాల బారిన పడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ సమస్యలపై ఇప్పటికే అనేక సార్లు వినతిపత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేత బాలచంద్రారెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి :