త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా కడపలో 50 డివిజన్ల నుంచి పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ వెల్లడించారు. కడప రవీంద్రనగర్‌లో భాజపా కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. నగరపాలక, మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై చర్చించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ తప్పుడు కేసులు పెట్టి... ఎన్నికలకు దూరం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడున్న పోలీసులను బదిలీ చేసి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. భాజపా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి