కడప జిల్లా బద్వేలులో అధికార పార్టీ నాయకుల ఆగడాలు పెరగడంతో పాటు.. భూకబ్జాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు(bjp state president somu veeraju) ఆరోపించారు. బద్వేలు త్యాగరాజు కాలనీలో.. వైకాపాకు చెందిన 150 మంది కార్యకర్తలు భాజపాలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా రహదారులు చాలా అధ్వానంగా తయారయ్యాయని సోము వీర్రాజు ఆరోపించారు. రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. ప్రధాని మోదీ వేసిన రహదారులే దిక్కయ్యాయని.. సీఎం జగన్ సైతం ఆ రహదారుల్లోనే వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ప్రజాసంకల్పయాత్రతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. అధికారంలోకి వచ్చాక తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. బద్వేలు భాజపా అభ్యర్థి సురేష్‌ను గెలిపించాలని.. సోము వీర్రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: