స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కడపజిల్లాలో భాజపా-జనసేన కలిసి పోటీ చేస్తాయని భాజపా నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు కేంద్రం ప్రవేశ పెడుతున్న పథకాలను వివరిస్తామని కడపలో జరిగిన భాజపా- జనసేన సమావేశంలో అన్నారు. ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తే కేసులు పెట్టాలని అధికార పార్టీ యోచిస్తోందని... తాము కూడా ఎన్నికల్లో ఎవరికి డబ్బు, మద్యం పంపిణీ చేయబోమని స్పష్టం చేశారు. కానీ అనవసరంగా తమపై కేసులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని... ధైర్యంగా ఎదుర్కొంటామని చేప్పారు. తమకు కేంద్రం అండగా ఉందని.. ఎవరి జోలికి వెళ్లమని... తమ జోలికి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. అధికార పార్టీ తప్పుడు కేసులు పెట్టి.. బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలవాలనుకుంటుందని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: 'ఎన్నికలకు దూరం అవుతోన్న 33 పురపాలికలు'