ప్రజలను ఇబ్బంది పెట్టే చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేయడం చాలా దారుణమని చర్యని ప్రొద్దుటూరు పొలిటికల్ జేఏసీ కన్వీనర్ రామయ్య అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పుర వీధుల్లో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మహా మానవహారం నిర్వహించారు. తెదేపా, వైకాపా, సీపీఎం, సీపీఐ, జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తే అసోం ముఖ్యమంత్రి కూడా నిరూపించుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ చట్టాలపై వ్యతిరేకత వస్తున్నా కేంద్రం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు.
ఇదీ చదవండి: