.
ప్రకృతి సోయగం...లంకమల క్షేత్రం సొంతం - కడప జిల్లా లంకమల క్షేత్రం తాజా
ఎటు చూసినా కొండలు పచ్చదనం పరుచుకున్న ఎత్తైన చెట్లు ఆధ్యాత్మికతను చాటి చెప్పే ఆలయాలు. ఇవి కడప జిల్లా లంకమల క్షేత్రం సొంతం. శివరాత్రి వచ్చిందంటే చాలు ఈ అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రహదారి పక్కన ఉన్న కొండలు కోనలు, అనేక వృక్షజాతులను చూస్తూ ఆస్వాదించవచ్చనే ఉద్దేశంతో దుమ్ము, ఎండను సైతం లెక్కచేయకుండా, వయసుతో నిమిత్తం లేకుండా కాలినడకన తరలి వస్తారు. అనంతరం ఈ క్షేత్రాన్ని చేరుకుని శివుని కృపకు పాత్రులవుతారు.
ప్రకృతి సోయగం...లంకమల క్షేత్రం సొంతం
.
ఇవీ చూడండి-పొలతల క్షేత్రంలో శివరాత్రి వైభవం