ETV Bharat / state

ROBBERY IN RTC WORKSHOP: కడప ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్​లో బ్యాటరీల చోరీ.. ఇది ఎవరి పని? - కడప జిల్లా తాజా వార్తలు

కడప ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్​(Kadapa rtc workshop)లో బ్యాటరీలు చోరీకి గురయ్యాయి(batteries robbery in Kadapa rtc workshop). కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ బ్యాటరీల విలువ రూ. లక్ష వరకు ఉంటుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

ROBBARY IN kadap RTC WORKSHOP
కడప ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్​లో చోరీ
author img

By

Published : Oct 30, 2021, 9:31 PM IST

కడప ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్​లో లక్ష రూపాయల విలువ చేసే బ్యాటరీలు చోరీకి గురయ్యాయి(batteries robbery in Kadapa rtc workshop). కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన ఆర్టీసీ విడిభాగాలను కడప వర్క్​షాప్​(Kadapa rtc workshop)లో మరమ్మతులు చేస్తారు. కాలం చెల్లిన బ్యాటరీలను తీసుకొచ్చి వర్క్ షాప్​లో అప్పగిస్తారు. అనంతరం వాటిని అక్కడ వేలం వేస్తారు.

అయితే.. ఇవాళ విధులకు వచ్చిన భద్రతా ఉద్యోగి.. ఆ బ్యాటరీలను భద్రపరిచే ప్రాంతాన్ని పరిశీలించగా.. అక్కడ సుమారు 40 బ్యాటరీలు చోరీకి గురైనట్లు గుర్తించారు(robbery in Kadapa rtc workshop). దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వర్క్ షాప్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఇది బయటి దొంగల పనా? లేక ఇంటి దొంగల పనా? అనే కోణంలో విచారిస్తున్నారు. చోరీకి గురైన బ్యాటరీల విలువ రూ. లక్ష ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి..

Badvel bypoll: ముగిసిన బద్వేలు ఉపఎన్నిక పోలింగ్‌..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.