రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది ఆర్టీసీ కార్మికులు.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కడప రీజినల్ మేనేజర్ జితేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. వైరస్‌తో ఇటీవల మరణించిన ఓ ఉద్యోగి కుటుంబానికి.. బద్వేల్ ఆర్టీసీ కార్యాలయంలో ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
సంస్థకు వెన్నెముకగా ఉన్న సిబ్బంది మహమ్మారితో మృతి చెందడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని ఇచ్చినట్టు తెలిపారు. ఆ మొత్తాన్ని.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు అందిస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: