కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ అన్నారు. పట్టణంలో పోలీసులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు కొవిడ్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉమేష్ చంద్ర కూడలి నుంచి శివాలయం వరకు ర్యాలీ కొనసాగింది.
తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సూచనలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: