వివేకానందరెడ్డి హత్యపై విచారణ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కుంటుంబ సభ్యుడు, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సిట్‌తో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు. ఎన్నో సందర్భాల్లో సిట్ వేసినా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి దోషులను శిక్షించాలన్నారు.
దోషులు ఎంతటి వారైన వదలకూడదన్నారు. వివేకా మృతదేహం వద్దకు వెళ్లినప్పుడు కనిపించని లేఖ అకస్మాత్తుగా ఎలా వచ్చిందో పోలీసులు తేల్చాలన్నారు.