ETV Bharat / state

ఎర్రచందనం అక్రమ రవాణాపై తనిఖీలు.. 67 దుంగలు స్వాధీనం

కడప జిల్లాలో అటవీశాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించారు. వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో 67 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Authorities seized 67 red sandalwood logs
67 దుంగలు స్వాధీనం
author img

By

Published : Jun 5, 2021, 10:15 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో అటవీశాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. చియ్యవరం గ్రామ సమీపంలో నిల్వ చేసిన 57 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఓబులవారిపల్లె మండలం వై. కోట గ్రామ సమీపంలో చేపట్టిన తనిఖీల్లో 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని తెలిస్తే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఎఫ్​వో శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి

Murder: పదకొండేళ్ల కాపురం.. అనుమానంతో విషాదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.