జర్నలిస్టులకు ప్రాణవాయువు అయినా అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించకపోవడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే కడప జిల్లా అధ్యక్షులు రామసుబ్బారెడ్డి విమర్శించారు. దీనిపై నిరసన తెలియజేస్తూ... ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కడప కలేక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఏళ్ల నుంచి అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పిస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న సమాచార శాఖ కమిషనర్ రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణం స్పందించి అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండీ...రైతులకు మద్దతుగా ఈనెల 21న కాంగ్రెస్ ఆందోళనలు