ETV Bharat / state

సీఎం జగన్ నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు - రెవిన్యూశాఖ ఉత్తర్వులు తాజా సవరణ - Changes in Pulivendula Revenue Department

AP Revenue Department Latest Orders: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి ఆంక్షలు వర్తించవు. నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేయకూడదన్న నిబంధనను సీఎం జగన్‌ నియోజకవర్గానికి మినహాయిస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించడమే ఇందుకు నిదర్శనం.

AP_Revenue_Department_Latest_Orders
AP_Revenue_Department_Latest_Orders
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 9:28 AM IST

సీఎం జగన్ నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు - రెవిన్యూశాఖ ఉత్తర్వులు తాజా సవరణ

AP Revenue Department Latest Orders : చట్టం ముందు అందరూ సమానులే. ప్రతి ఒక్కరు చట్టాల్ని, నిబంధనల్ని పాటించాలి. అదే విధంగా గౌరవించాలి. ప్రజాప్రతినిధులైతే వాటిని అంతే హుందాగా అనుసరించాలి. కానీ ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy)కు వర్తించవు. ఆయన అనుకుందే తడవుగా చట్టాలు, నిబంధనలు తన చుట్టాలుగా మారిపోతాయి. నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పంపిణీ (Government Places Distribution) చేయకూడదన్న నిబంధనను సీఎం జగన్‌ నియోజకవర్గానికి మినహాయిస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించడమే ఇందుకు నిదర్శనం.

Restrictions Do Not Apply to Pulivendula : సీఎం జగన్ సొంత నియోజకవర్గానికి ప్రత్యేక ప్రతిపత్తి ఏదైనా ఉన్నట్లు ప్రకటించినట్లు ఉన్నారు. ఎందుకంటే నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేయకూడదన్న నిబంధనను పులివెందుల మండలానికి సవరిస్తూ ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని మూడు గ్రామాల్లో పదకొండు వందల ఎకరాల భూములను పదకొండు వందల మంది పేదలకు ఎకరా చొప్పున అందించేందుకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎన్ని సార్లు చెప్పిన మారని వైఖరి - మరోసారి నిధులను పక్కదారి పట్టించిన జగన్ సర్కార్

Revenue Department Orders Exempting Pulivendula Constituency : జిల్లా, మండల కేంద్రాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు అయిదు కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ స్థలాల పంపిణీపై 2012లో నిషేధం విధించారు. పులివెందుల మండలం కనపల్లి, ఎర్రబల్లి గ్రామాల పరిధిలోని 1039.09 ఎకరాలు, యర్రగుడిపల్లిలో 61 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములు పులివెందులకు 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఈ మూడు గ్రామాలకు చెందిన కొందరికి పట్టాలు ఇచ్చేందుకు సీఎం జగన్ తల్లి విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా జాబితా తయారైంది. నిషిద్ధ ఉత్తర్వుల వల్ల అది అమలు కాలేదు.

కనపల్లిలోని సర్వే నంబరు 87-1, సర్వే నంబర్‌ 773-1, ఎర్రబల్లిలోని 376-1, యర్రగుడిపల్లిలోని సర్వే నంబరు 168లోని 61 ఎకరాల్లో పేదలు చాలాకాలంగా నివాసం ఉంటున్నారు. పట్టాలు లేనందున వారికి ప్రభుత్వ పథకాలు కూడా అందట్లేదు. యురేనియం ప్లాంటు కార్యకలాపాలు విస్తరిస్తే వీరికి నష్టం జరుగుతుంది. రాష్ట్ర మంత్రి వర్గం కూడా వీరికి పట్టాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

Minister Dharmana: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు: ధర్మాన

అయిదు కిలోమీటర్లలోపు ఉండకూడదన్న నిబంధన నుంచి ఈ మూడు గ్రామాలకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని వైయస్ఆర్ జిల్లా కలెక్టర్.. రెవెన్యూశాఖకు ఇటీవల పంపిన నివేదికలో కోరారు. దీనికి లబ్ధిదారుల జాబితాలను జతచేశారు. వీటిని పరిశీలించి, మినహాయింపు ఇస్తున్నట్లు బుధవారం రెవెన్యూశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా దాదాపు 10 లక్షల వరకు పలుకుతోంది.

రెవిన్యూ వ్యవస్థలో సమూల మార్పులు: మంత్రి బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.