కడప జిల్లాలో కొవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న క్రమంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. కరోనా నియంత్రణకు విధించిన నిబంధనలు పాటిస్తూనే దర్గాలో కేవలం 50 మందితో మాత్రమే పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు కరచాలనం చేయడం కానీ ఆలింగనం చేయరాదన్నారు. చిన్నపిల్లలు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ప్రార్థనా మందిరాల్లోకి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. ఎవరి నివాసాల్లో వాళ్లే పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 3.48లక్షల కరోనా కేసులు