విశాఖ నుంచి కడప జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని విశాఖ నుంచి కడపకు తరలించే ముఠాలో ప్రధాన స్మగ్లర్ చింతపల్లి మండలానికి చెందిన మత్స్యరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు రవాణ దారులకు మత్స్యరాజు తరచూ గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ ముగ్గురు.. మరో ఏడుగురికి గంజాయిని సరఫరా విక్రయిస్తున్నారు. వారం కిందట 16 కిలోల గంజాయి తరలిస్తుండగా ముఠాను పట్టుకున్న పోలీసులు.. వారిచ్చిన సమాచారంతో ఇవాళ మరో 11 మందిని అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో మత్తు పదార్థాలు వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుందని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: స్పుత్నిక్ వి టీకా ధర రూ.995.40