All party meeting on Acchanna murder incident: దళిత బాంధవుడు అని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కడప పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న హత్య కేసుపై స్పందించాలని అఖిలపక్షనేతలు డిమాండ్ చేశారు. హత్యపై సిటింగ్ జడ్జిచే విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు. అచ్చన్న హత్య ఘటనపై అఖిలపక్ష పార్టీ నాయకులు కడప ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. కేవలం మాస్కులు అడిగిన పాపానికి మొన్న సుధాకర్ డాక్టర్ ను, ఎక్కడ తన అవినీతిని బయటపెడతారని ఉద్దేశంతో ఓ ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేశారని... నేడు డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్న అచ్చన్నను హత్య చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వం అచ్చన్న హత్య కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈనెల 8న కడపలో అఖిలపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. అచ్చన్నది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని పేర్కొన్నారు. గత నెల 12వ తేదీ కిడ్నాప్‌కు గురైన అచ్చన్నను గుర్తించడంలో కడప ఒకటో పట్టణ పోలీసులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. 14వ తేదీ అచ్చన్న కుమారుడు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు.
అదృశ్యమైన అచ్చన్న ఆచూకీ కనుగొనడంలో పోలీసులు త్వరగా స్పందించలేదని ఆరోపించారు. హత్య కేసుకు సంబంధించి అదే శాఖలో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరో ఇద్దరినీ మాత్రమే అరెస్టు చేశారు. కానీ మిగిలిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి సర్కార్‌లో దళితులకు రక్షణ లేకుండా పోయిందని అఖిలపక్ష నేతలు విమర్శించారు. గత ఆరు మాసాల నుంచి పశుసంవర్ధక శాఖలో అచ్చన్నకు కిందిస్థాయి సిబ్బందికి జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మనస్పర్ధలను పరిష్కరించడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. తక్షణం అచ్చన్న కేసును సిట్టింగ్ జడ్జించే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని నేతలు పేర్కొన్నారు.
కడప పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ అంశంపై ప్రభుత్వం త్వరగా స్పందించాలి. కేసు విషయంలో పశువర్ధక శాఖలో ఉన్న వ్యక్తులు కొందరు ఆయన హత్యకు కారణమయ్యారు. అచ్చన్న కుమారుడు తన తండ్రి కనిపించడంలేదని కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదు. హత్య కేసులో అధికారులు ఏదో దాస్తున్నారు. హత్యకు కారణం అయిన వారిపై చర్యలు చేపట్టాలి. జిల్లా స్థాయి అధికారిని హత్య చేస్తే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గమనిస్తే తెలుస్తుంది, ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తుందో అనేది. చంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప
ఇవీ చదవండి