కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని కడప జిల్లా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు ఆరోపించారు. కడప ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు తక్షణం ఆపాలని... లేదంటే రాయలసీమ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు హెచ్చరించారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిలుపుదల కోరుతూ.. సోమవారం కడపలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
తెలంగాణ మంత్రులు.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్నారని.. ఇక స్పందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఇదీ చదవండి..