ఓ పక్క కరోనా వైరస్‌తో పంట ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు నష్టపోతుండగా మరోపక్క ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నారు. ఇటీవల కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వానతో కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. కడప జిల్లా బద్వేల్, పోరుమామిళ్ల వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లలో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటిస్తున్నారు. నష్టం అంచనా రూపొందిస్తున్నారు. ఒక్క బద్వేల్ నియోజకవర్గంలోనే వంద ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్నాక ఇలా చేయాల్సిందే!