ETV Bharat / state

తాడిపత్రి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - kamalapuram mandal latest accident news

లారీ, స్కూటరు, కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పందిళ్లపల్లె గ్రామం వద్ద చోటు చేసుకుంది. మృతుడు ఎర్రగుంట్లకు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

accident happened in tadipatri highway in kadapa district
లారీ. స్కూటర్​, కారు ఢీకొని ఒకరు మృతి
author img

By

Published : Jun 28, 2020, 4:00 PM IST

కడప జిల్లా కమలాపురం మండలం పందిళ్లపల్లె గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. తాడిపత్రి ప్రధాన రహదారిపై లారీ, స్కూటరు, కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.

వీరిద్దరినీ ఎర్రగుంట్ల వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రముఖ సిమెంట్​ కర్మాగారంలో పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ఘటనా స్థలానికి కమలాపురం పోలీసులు చేరుకున్నారు. ఘటన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.