కరోనా భయంతో కడప జిల్లా వేంపల్లి మండలంలోని టి.వెలమవారి పల్లె గ్రామస్థులు తమ ఊరిలోకి ఎవరినీ రానీయకుండా పొలిమేరల్లో ముళ్ల కంచె వేశారు. కొత్త వ్యక్తులు, విదేశాల నుంచి వచ్చిన వారు, ఊర్లోవారి చుట్టాలు ఇలా ఎవరినీ గ్రామంలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఊరిలోకి వచ్చే అన్ని దారులను మూసేశారు. విషయం తెలుసుకున్న వేంపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ముళ్ల కంచెను తొలగించారు. ఏదైనా తాత్కాలికంగా చెక్పోస్టులాగా ఏర్పాటు చేసుకోవాలే తప్ప ఇలా ముళ్ల కంచెలు వేసి ప్రజల నిత్యావసర, ఆరోగ్య సేవల రవాణాకు ఇబ్బంది కలగనీయకూడదని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా వెంటనే 100కు డయల్ చేయాలని లేదా ఆరోగ్య టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని వేంపల్లి ఎస్సై శుభాష్ చంద్రబోస్ తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు.. 12కు పెరిగిన సంఖ్య