ETV Bharat / state

కన్న తల్లి బరువైంది... జనసంచారం లేని ప్రాంతంలో వదిలేసిన కుమారుడు - కడప తాజా వార్తలు

నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులనే భారంగా భావిస్తున్నారు కొందరు. జీవిత చరమాంకంలో ఆసరాగా ఉండాల్సిన వారే అనాథలుగా వదిలేసి వెళ్లిపోతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తల్లిని జనసంచారం లేని ప్రదేశంలో నిర్ధయగా వదిలి వెళ్లాడో కుమారుడు. ఎవరూలేని ఆ ప్రాంతంలో.. తన కుమారుడు వచ్చి తీసుకెళ్తాడని ఆశగా ఎదురు చూసి ఆ మాతృమూర్తి సొమ్మసిల్లిపడిపోయింది. ఈ విషాదకర ఘటన కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో జరిగింది.

person leaves his mother
కన్న తల్లిని వదిలేసిన కుమారుడు
author img

By

Published : Nov 13, 2020, 11:47 AM IST

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని... కారడవిలో వదిలేశాడు ఓ దయలేని పుత్రుడు. లాలించి, గోరు ముద్దలు తినిపించిన తనయుడికి.... ఆ తల్లి పోషణే కష్టంగా మారింది. దయాదాక్షిణ్యాలు మరిచి ఆమెను వదిలించుకోవాలని జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు. ఇది అర్థం కాని ఆ తల్లి పుత్రడు రాక పోతాడా అని నిరీక్షించింది. కాని ఆమె కోరిక తీరలేదు. ఆ తనయుడు రాలేదు. అది తెలుకున్న ఆ అమ్మ మనసు భోరున విలపించింది. కాసేపటికి నిస్సతువతో స్పృహ తప్పి పడిపోయింది.

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన లింగమ్మని ఆమె కుమారుడు, కోడలు ఆటోలు తీసుకొచ్చి కడప సర్వజన ఆసుపత్రి సమీపంలో జనసంచారం లేని ప్రాంతంలో వదిలి వెళ్లాడు. తిరిగి వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. వాళ్లు వస్తారని ఎంతో సేపు ఎదురు చూసిన ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అటు వైపు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఆమెను చూసి వెంటనే సపర్యలు చేసి ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఆమె దయనీయ పరిస్థితి చూసి చలించిపోయిన కానిస్టేబుల్‌ వారు రారని నిర్ధారించుకుని ‘108’కి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి ఆమెకు పూర్తిస్థాయిలో సపర్యలు చేసి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండీ...

కొత్త జిల్లాలపై కదలిక.. జనవరికల్లా ఏర్పాటుకు సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.