విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కడప జిల్లా లింగాల మండలం గుణకనపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన గోపి అనే రైతు తన పొలంలోని విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరించి విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. రైతు మృతికి కారకులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి.