కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన 95 ఏళ్ల వృద్ధురాలు ముగ్గు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిగా నడవలేని పరిస్థితిలో కూడా పండగ వేళ తన ఇంటి ముందు ముగ్గు వేసింది. బండపై కూర్చొని తనకు వచ్చిన రీతిలో ముగ్గువేసి ఆనందపడింది. మరోవైపు కర్నూలు జిల్లాలో తీరొక్క ముగ్గులతో మహిళలు పండగ శోభను రెట్టింపు చేశారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి పూజలు నిర్వహించారు.
ఇదీచదవండి.