నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేయడంతో కడప జిల్లా అట్లూరు మండలంలోని ముంపు గ్రామాలను సోమశిల వెనుక జలాలు చుట్టుముట్టాయి. మరోవైపు వేములూరు వంతెనపై సోమశిల వెనుక జలాలు, సగిలేరు వరద చేరటంతో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. వంతెన మునిగిపోవటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. 30 గ్రామాల ప్రజలు అట్లూరు మండల కేంద్రానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. వంతెన ఇరువైపులా ముళ్ల కంప వేసి పోలీసులను కాపలా పెట్టారు అధికారులు.
సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముంపు గ్రామాల వాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే పరిహారం చెల్లించే వరకు గ్రామాలను ఖాళీ చేసే పరిస్థితి లేదని ముంపు వాసులు అధికారులకు తెలియజేశారు.