పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం మట్టి మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. మండలంలోని చేబ్రోలు గ్రామంలో దళిత మహిళకు చెందిన భూమిలో బుధవారం రాత్రి వైకాపా నాయకులు దొంగచాటుగా గ్రావెల్‌ను తవ్వి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న భూ యజమాని.. తవ్వకాలను వాడుకునే ప్రయత్నం చేయగా అతనిపై దాడికి యత్నించారని బాధితుడు తెలిపారు. దీంతో మట్టి మాఫియా దౌర్జన్యంపై చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ఒక జేసీబీ, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ బడా వైకాపా నేత.. స్వాధీనం చేసుకున్న వాహనానాలను వదిలేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి..