పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలోని కొండాలమ్మపుంతలో మద్యం దుకాణం తెరవటం పట్ల మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దుకాణం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చేసుకోవటానికి పనులు లేక కుటుంబాలు గడవని స్థితిలో మద్యం దుకాణాలు తెరిస్తే వచ్చిన డబ్బులన్నీ... మద్యం దుకాణాలకే వెళ్లిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు నిత్యావసరాలు నిమిత్తం బయటకు వెళ్లటానికి నిబంధనలు అడ్డు వస్తాయని... కాని మద్యం అమ్మకాలకు నిబంధనలు అడ్డురావా అని ప్రశ్నించారు.