పశ్చిమ గోదావరి జిల్లా ఉండి బస్టాండ్లో చెత్త కాగితాలు ఏరుకునే జీవిస్తున్న గర్భిణీపై నుంచి ఆర్టీసి బస్ వెళ్లడంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దువ్వ గ్రామానికి చెందిన గండి వెండికోట అన్నపూర్ణమ్మ చిత్తుకాగితాలు ఏరుకుంటూ స్థానికంగా జీవనం సాగిస్తోంది . శుక్రవారం రాత్రి సమయంలో బస్టాండ్ లోకి వస్తున్న ఆమెను భీమవరం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్సు వెనుక చక్రం ఆమె రెండు కాళ్లు పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైంది. బస్టాండ్ పూర్తిగా అంధకారంలో ఉండటంతో డ్రైవర్ బస్సు వెనుక ఉన్న ఆమెను గమనించలేకపోయాడు. చికిత్స నిమిత్తం అత్యవసర వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలి భర్తకు తమ వంతు సాయంగా నాలుగు వేల రూపాయలు అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాధితురాలు గంట పాటు నరక యాతన అనుభవించింది. ఉండి బస్టాండ్ లో సరైన సౌకర్యాలు, కనీసం లైట్లు కూడా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.
ఇవీ చదవండి: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం... నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి