సంక్రాంతి సందర్భంగా జిల్లాలో ఎక్కడా కోడిపందేలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడుతూ.. కోడిపందేలతో పాటు పేకాట, గుండాట తదితర జూదాలకు చెక్ పెడుతున్నామన్నారు. జిల్లాలో 35 పోలీసు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని వివరించారు. కోడికాళ్లకు కట్టే కత్తులను పెద్దఎత్తున స్వాధీనం చేసుకుంటున్నామని ఇప్పటివరకు 9,700 స్వాధీనం చేసుకున్నామన్నారు. సంక్రాంతికి సంప్రదాయ ముగ్గుల పోటీలు, కబడ్డీ, క్రికెట్, స్లో సైక్లింగ్ క్రీడలను నిర్వహించాలని కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని సూచించారు. ఈ సంక్రాంతికి ఇప్పటికే 10 ఆదాయపన్ను బృందాలు రంగంలోకి దిగాయని పందేలరాయుళ్ల పై పూర్తి నిఘా ఉంటుందన్నారు. లాడ్జీలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. అనంతరం ఆయన ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ప్రదర్శనగా ఉంచిన కోడి కత్తులను పరిశీలించారు.
ఇదీ చదవండి: పశ్చిమగోదావరి జిల్లాలో యువకుడు దారుణ హత్య