న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కోర్టు జడ్జ్ జి.సునీత తెలిపారు. ఏలూరు ఉన్న జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో పోలీసు అధికారులు, పారా లీగల్ వాలంటీర్లు, ప్యానల్ న్యాయవాదులతో ఆమె సమావేశమయ్యారు.
సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలకు అనుగుణంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా అందించేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేయనున్న ముందస్తు న్యాయ సేవా కేంద్రాలలో పారాలీగల్ వాలంటరీ, న్యాయ సేవల ప్యానల్ న్యాయవాది అందుబాటులో ఉంటారన్నారు. నిందితుల అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత రిమాండ్ దశలో ఉచిత న్యాయ సలహా అందిస్తామని చెప్పారు. అరెస్టైన దశ నుంచి తీర్పు వచ్చేవరకు న్యాయవాది నియమించుకోలేని పేదవారికి ఉచిత న్యాయ సహాయం చేయనున్నట్లు తెలిపారు. నిరక్షరాస్యులు, న్యాయ విధానం పట్ల అవగాహన లేని వారిని దృష్టిలో ఉంచుకొని అరెస్టుకు ముందు న్యాయ సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: