పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో తొమ్మిది రోజులు పాటు జరిగే శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి 63వ వార్షిక మహోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సర్వేశ్వర తెలిపారు. వేడుకలకు పశ్చిమగోదావరి, కృష్ణా, ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. జబర్దస్త్ నటులతో రెండు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు.
ఇవీ చూడండి: