చింతలపూడి, పట్టిసీమకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీ నివేదికపై.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ముత్యాలరాజు, పోలవరంతో పాటు ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. చింతలపూడి, పట్టిసీమ వల్ల కలిగే పర్యావరణ ఇబ్బందులపై నివేదికలో పొందుపరిచిన అంశాల మీద చర్చించారు.
హరిత ట్రైబ్యునల్ కమిటీ లెవనెత్తిన ప్రశ్నలకు.. సంబంధిత అధికారులు, ఇంజనీర్లు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ప్రాజెక్టు ఏర్పాటులో పాటించిన భద్రతా ప్రమాణాలు, మట్టి స్థిరత్వం కోసం తీసుకొన్న చర్యలు, మట్టి ఆడిట్ వివరాలు, పర్యావరణానికి కలిగే నష్టంపై అంచనా, భూమికి నష్టపరిహారం వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: