కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న బంద్‌లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్రం ప్రభుత్వం బంద్‌కు మద్దతు ప్రకటించడంతో వాటిని ముందుగానే డిపోల్లో నిలిపేశారు. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే బస్టాండ్లు బంద్‌తో బోసిపోయాయి. వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
ఇదీ చదవండి: న్యాయ సమీక్షకు పోలవరం హెడ్‌వర్క్స్ అదనపు పనులు