రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా వైద్య శాఖ అధికారులు, కలెక్టర్‌తో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏజెన్సీలో మలేరియా కేసులు పెరగకుండా అదుపు చేయాలని వైద్యులకు సూచనలు జారీ చేశారు. ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. అనంతరం పద్మ వారి గూడెం సమీపంలో నిర్మించబోయే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు.
పేదలందరికీ మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. సమయానికి వైద్యం అందక ఏ ఒక్కరూ మరణించకూడదనేది ముఖ్యమంత్రి ఆదేశం. అందులో భాగంగానే రాష్ట్రంలోని 7 ఐటీడీఏల పరిధిలో 7 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపడతాం. బుట్టాయిగూడెంలో 75 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తాం. దీనికి ఆగస్టు నెలలో టెండర్లు పిలిచి వచ్చే రెండేళ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం- ఆళ్ల నాని.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి