గ్రామ వాలంటీర్లు వారికిచ్చిన లక్ష్యాలను పార్టీలకు అతీతంగా పూర్తిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలను సోమవారం అందజేశారు. అదే విధంగా రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం కొత్త ఒరవడి తీసుకు వచ్చిందని... ప్రతి ఒక్కరూ గ్రామాల్లో సేవలు అందించి తగిన గుర్తింపు పొందాలన్నారు. ఉత్తమ గ్రామ వాలంటీర్లకు 25 వేల నగదు బహుమతి అందిస్తామన్నారు.
శిక్షణ ప్రారంభం
దెందుళూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ వాలంటీర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణాధికారులు శ్రీనివాస్ కుమార్, రత్న రాజు ప్రభుత్వ పథకాలు వివరిస్తూ వాటిని ప్రజలకు అందించే వివరాలను తెలిపారు. గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేయడమే గ్రామ వాలంటీర్ల లక్ష్యమన్నారు. ఏ స్థాయిలో తప్పు జరిగిన వాలంటీర్లను తొలగించడం జరుగుతుంది అన్నారు. స్థానికంగా ఉపాధి పొందుతూ అందరినీ కలుపుకుని పోవాలని... పార్టీలతో సంబంధం లేకుండా పని చేయాలన్నారు.
ఇదీ చదవండి :