ETV Bharat / state

ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతు

సెల్ఫీ సరదా కారణంగా ఎంతో మంది యువత తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. అధికారులు హెచ్చరికలు జారీ చేసినా లెక్క చేయకుండా.. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కొల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఉప్పుటేరులో జరిగింది.

uppteru railway bridge
ఉప్పుటేరు వంతెన
author img

By

Published : Jul 26, 2021, 3:38 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఉప్పుటేరు రైల్వే బ్రిడ్జి వద్ద నలుగురు యువకులు సెల్ఫీ దిగుతుండగా.. ప్రమాదవశాత్తూ ఇద్దరు యువకులు నీటిలో పడి గల్లంతయ్యారు. ఆకివీడులోని పెదపల్లి వీధికి చెందిన యువకులు ఎ. సాయి (21), పొన్నమండ గంగరాజు, కరుణాకర్​లతో పాటు నర్సాపురానికి చెందిన తిరుమాని లోకేశ్ (23).. నిన్న సాయంత్రం స్థానిక ఉప్పుటేరు రైల్వే వంతెన వద్దకు వెళ్లారు. అక్కడ మొదటి పిల్లర్ వద్ద చరవాణితో సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు లోకేశ్ కాలుజారి ఉప్పుటేరులో పడిపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో సాయి కూడా నీటమునిగాడు.

మిగిలిన ఇద్దరు వారిని రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. సాయి మృతదేహం లభించింది. మరొక యువకుడు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సాయికి 6నెలల క్రితం వివాహం అయింది. అతని మరణంతో కుటుంబంలో శోకం మిన్నంటిది. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండీ.. కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.