పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు రెవెన్యూ డివిజన్‌లో దాదాపు 169 గ్రామాలున్నాయి. అందులో 95 గిరిజన గ్రామాలే. వాటిలోనూ మరో 26 గ్రామాల్లో.. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీలే ఉంటున్నారు. చదువరులు, నాగరీకులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లల్లోనే కట్టడి చేసేందుకు పోలీసు దళాలు అతి తీవ్రంగా పనిచేస్తుండగా.. ఆ మారుమూల అటవీ గ్రామాల్లో మాత్రం స్వచ్ఛందంగా లాక్‌డౌన్ జరుగుతోంది. కరోనా మహమ్మారి ప్రజలకు ఆరోగ్య సూత్రాలు చక్కగా అలవడేలా చేస్తోంది.
జిల్లాలోని కూనవరంలొద్ధి గ్రామంలో.. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. ఈ గ్రామంలోని ఆవాసాలన్నీ ఆదివాసీలవే. రెక్కాడితేనేగానీ డొక్కాడని ఈ నిరుపేదలు వారం రోజులుగా ఇంటి నుంచి కాలు బయటపెట్టటం లేదు.
నిత్యావసర సరకుల కోసం సమదూరం పాటిస్తూ...
ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వీరికి అక్షరం ముక్క తెలియదు. బయట ప్రపంచం గురించి తెలుసుకుందామంటే వార్తా పత్రికలు చదవలేరు, టీవీలు చూసేందుకు విద్యుత్ సదుపాయం లేదు. అయినా సరే కరోనా మహమ్మారి తీవ్రత వారికి తెలిసింది. మనుషులు దగ్గరగా ఉండకూడదనీ, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలనీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని వారు వివరిస్తున్నారు. నిత్యావసరాలు కొనేటప్పుడూ సమదూరం పాటిస్తూ.. స్వీయ నియంత్రణతో వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి: