పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరులో దళితుల భూమి ఇళ్ల స్థలాలకు తీసుకుంటున్నారని ధర్నా చేపట్టారు. పేదల భూములు ప్రభుత్వ ఇళ్ల స్థలాల పేరుతో నాయకులు కబ్జా చేస్తున్నారంటూ.. నినాదాలు చేశారు. దశాబ్దాలుగా దళితులు సాగుచేసుకుంటున్న పొలాలు.. ఇంటి స్థలాల పేరుతో ప్రభుత్వం లాక్కుంటోందని వారు వాపోయారు. ఇంటి స్థలాల కోసం ఇతర భూములు ఉన్నా.. నిరుపేదల భూములనే స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఈఎస్ఐ మందుల కుంభకోణంలో చంద్రబాబుకూ వాటా ఉంది: బొత్స