పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆస్పత్రిలో చేరడానికి వచ్చిన కరోనా రోగి రాత్రంతా రహదారిపైనే గడపాల్సి వచ్చింది. భీమవరం శివారు నాయుడుపేటకు చెందిన వ్యక్తికి కొవిడ్ వైరస్ సోకడంతో తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరేందుకు వచ్చాడు.
రాత్రంతా రోడ్డుపైనే..
రోగి పరిస్థితి సాధారణం కంటే భిన్నంగా ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది చేర్చుకోలేదు. ఫలితంగా రోగి రాత్రి నుంచి తెల్లవారే వరకు సమీపంలోని సిల్వర్ జూబ్లీ రోడ్పైనే దుప్పటి పరుచుకొని పడుకున్నాడు. చివరికి రోగి బంధువులు బాధితుడ్ని కాకినాడ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి : చెక్ బౌన్స్ అయితే శిక్షలు ఏంటి?