కొన్నాళ్లుగా గ్రామంలో అందరికి సుపరిచితమైన వ్యక్తి మంగర శ్రీనివాస్. రొయ్యల చెరువులు సాగు చేస్తూ... పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. మంచి నమ్మకస్తుడుగా ఉండేవాడు. ఆ పేరుతోనే రొయ్యల సాగుకు పెట్టుబడి కోసం... గ్రామస్థుల వద్ద అప్పు తీసుకున్నాడు. అలా ఊరిలో జనాల నుంచి దాదాపు కోటి రూపాయల మేర రుణాలు చేశాడు.
అప్పు చేసి ఏళ్లు గడుస్తున్నా తీర్చకపోవడంతో శ్రీనివాస్ ఇంటి ముందు బాధితులు నిరసన చేపట్టారు. శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులను... తమ డబ్బులు ఇవ్వాలని గ్రామస్థులు అడిగితే... బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. రుణం తీసుకుని సంవత్సరాలైనా ఇంత వరకు అసలు, వడ్డీ చెల్లించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ సమాధానం చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసిన్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కల్పించుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: యువతుల మర్డర్ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు!