కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారాలు స్వర్ణకాంతులీనుతున్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నేతృత్వంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీవారి ప్రధాన ముఖ ద్వారం, తలుపులు, అంతరాలయ ముఖ ద్వారానికి 1,264 గ్రాముల బంగారంతో తాపడం చేయించారు. దీని కోసం రూ.98,31,693 వెచ్చించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంత్రి శ్రీరంగనాథరాజు ఆదివారం ఆలయ ముఖ ద్వారాలను పరిశీలించారు.
ఇదీ చదవండి: