పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలోని రజక చెరువులో 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తి ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా? లేక హత్య చేసి పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే తాళ్లపూడి పోలీసులకు సమాచారం అందివ్వాలని ఎస్సై సతీశ్ కోరారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి