ETV Bharat / state

తణుకు మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమరావతి పరిరక్షణ ఐక్య సంఘాల వేదిక పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు.

thanuku ex mla arimilli radha krishna
తణుకు మాజీ శాసనసభ్యుడు ఇంటి వద్ద ఉద్రిక్తత
author img

By

Published : Jan 20, 2020, 1:58 PM IST

అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్ళేందుకు నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి ఇంటికి తరలివచ్చారు. ఇంటి నుంచి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై రాధాకృష్ణ ఆయన అనుచరులు బైఠాయించారు. పోలీసులకు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని అన్న విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...

నాయకుల ముందస్తు అరెస్ట్... చలో అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసుల చర్యలు

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286, 9493337409
తేదీ:20.01.2020
ఐటమ్: తణుకు మాజీ ఎమ్మెల్యే గృహనిర్బంధం
AP_TPG_12_20_TANUKU_EX_MLA_NIRBANDHAM_UDRIKTATA_AB_AP10092
(. ) అమరావతి పరిరక్షణ ఐక్య సంఘాల వేదిక పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసనసభ్యులు arimilli radha krishna ను పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తణుకు మండలం వేల్పూరులో ఆయన స్వగృహం వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Body:అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్ళేందుకు నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు ఆరిమిల్లి ఇంటికి తరలివచ్చారు. ఇంటి లోపల నుంచి బయలుదేరుతున్న సమయంలో గేటు వద్ద మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. వారిని దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంత దూరం రాధాకృష్ణ ఆయన అనుచరులు ముందుకు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన పోలీసులు నిలువరించారు.

Conclusion:పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఇంటి ముందు రోడ్డు పైనే రాధాకృష్ణ ఆయన అనుచరులు బైఠాయించారు పోలీసులకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని అన్న విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు అమరావతి పరిరక్షణకు తాము చేస్తున్న ఉద్యమానికి పోలీసులు కూడా సహకరించాలని కోరారు పోలీసులకు ప్రభుత్వానికి కొమ్ముకాయడం దురదృష్టకరమన్నారు పోలీసులు తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము చేస్తున్న ఉద్యమానికి సహకరించాలని రాధాకృష్ణ కోరారు.
బైట్: అరిమిల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.