నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు వ్యాఖ్యలపై పశ్చిమగోదావరి జిల్లా తెదేపా నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద నిరసన ర్యాలీ సందర్భంగా... ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, టీడీఎల్పీ ఉప నేత రామానాయుడులు జిల్లా పరిస్థితులను ఇతర నేతలకు వివరించారు. రఘురామకృష్ణంరాజులా వైకాపాలో చాలా మందే ఉన్నారని... ఆయన ధైర్యవంతుడు కాబట్టి ముందుకొచ్చి మాట్లాడారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోకుండా.. కనీసం వైకాపా ప్రజా ప్రతినిధుల మనోభావాలను గుర్తించాలని హితవు పలికారు.
సామాజిక వర్గాల్లో చిచ్చు పెడుతోందన్న రఘు రామకృష్ణంరాజు వ్యాఖ్యలు నూటికి నూరు పాళ్లు నిజమేనని తెదేపా నేతలు స్పష్టం చేశారు. ఎంపీ రఘు రామకృష్ణం రాజు ప్రజల మనిషి అని... ఆయన చెప్పినట్టు నర్సాపురం పార్లమెంట్ తెదేపా బెల్టేనని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు.
ఇవీ చదవండి: 'ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకదన్న మాటల్లో నిజం లేదు'