ETV Bharat / state

'మధ్యాహ్న భోజన పథకంలో పేరుకే రోజుకో మెనూ'

author img

By

Published : Feb 25, 2021, 5:58 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్​లో మధ్యాహ్న భోజనాన్ని స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆకస్మికంగా పరిశీలించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు.. తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించారు.

TDP MLA Manthena Ramaraju inspects lunch scheme at Undi Zilla Parishad High School in West Godavari district
'మధ్యాహ్న భోజన పథకంలో పేరుకే రోజుకొక మెనూ'

పశ్చిమగోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై తెదేపా ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్వయంగా భోజనాన్ని రుచి చూసిన ఆయన... ఇందులో ఉప్పు తప్ప.. ఏమీ లేదని మండిపడ్డారు. ఇంత దారుణమైన భోజనాన్ని పిల్లలకు అందిస్తుండడం బాధాకరమని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పేరుకే రోజుకో మెనూను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏక్తా శక్తి పౌండేషన్​పై వస్తున్న ఫిర్యాదులతో.. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరీక్షించేందుకే ఇక్కడకు వచ్చానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ పౌండేషన్​పై గతేడాది లిఖితపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ.. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్ని హైస్కూల్లో స్వచ్ఛందంగా నిలిపివేశారని తెలిపారు. ఈ పౌండేషన్​పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

పురపోరు నిర్వహణకు పోలీస్, రెవెన్యూ అధికారులు కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.