రాష్ట్ర మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో అవకతవకలు జరిగాయంటూ.. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయటం దారుణమని తెదేపా నాయకులు ఆగ్రహించారు. అరెస్టుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈఎస్ఐలో జరిగిన అవకతవకలలో అధికారులు బాధ్యులని ఏసీబీ అధికారులు చెప్తుంటే... ఏ సంబంధంలేని అచ్చెన్నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: మా బాబాయ్ చేసిన తప్పేంటి?: ఎంపీ రామ్మోహన్‌నాయుడు