స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణమని మాజీమంత్రి కేఎస్.జవహర్ ఆరోపించారు. కశింకోట మరణాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం పేరుతో ధరలను 75శాతం పెంచి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు
లాక్ డౌన్ సమయంలోనూ మద్యం దుకాణాలు తెరిపించి... కరోనా వ్యాపింపజేశారని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో మద్యం చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం ధరల్ని పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణ