రెండునెలలుగా భారీ వర్షాలు, వరదలతో రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీసం క్షేత్రస్థాయి పర్యటన చేయలేదని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు తెదేపా కార్యాలయంలో ఆయన ఏలూరు తెదేపా పార్లమెంటు బాధ్యులుగా పదవీబాధ్యలు చేపట్టారు. జిల్లా నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గన్ని వీరాంజనేయులును పలువురు నాయకులు అభినందించారు.
పంటనష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 25వేలు పంటనష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: